Header Banner

ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల పనులు ప్రారంభం..! కేంద్రమంత్రి కీలక ప్రకటన!

  Sat May 24, 2025 06:53        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంట్ స్థాయి మినీ మహానాడులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తన పనితీరును ప్రధాని మోదీ, రాష్ట్రానికి తెస్తున్న నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గమనిస్తున్నారని.. అందుకే ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రిగా తనకు అవకాశం ఇచ్చారన్నారు రామ్మోహన్‌నాయుడు.

ఏపీలోని శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలో విమానాశ్రయాలు త్వరలో ప్రారంభిస్తామన్నా రామ్మోహన్ నాయుడు. మరో మూడు చోట్ల కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది అన్నారు. అమరావతికి రూ.48 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.10,500 కోట్లు తీసుకురాగలిగామని.. రైల్వే జోన్‌కు శంకుస్థాపన కూడా చేశామన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. సంక్షేమం- అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.


ఇది కూడా చదవండి: గుంటూరు ఉద్యాన రైతులకు గుడ్ న్యూస్..! వాటి సాగుపై రాయితీ పెంపుదల!


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ‘ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ రెండు నగరాల మధ్య విమాన రాకపోకలు ఉంటాయి. ఈ విమాన సేవల ద్వారా రాష్ట్రంలో అంతర్గతంగా కనెక్టివిటీ పెరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఇది కీలకంగా మారనుంది’ అన్నారు.

జులై 2వ తేదీ నుంచి క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన సేవలు ప్రారంభమ‌వుతాయని ఏపీ మంత్రి టీజీ భ‌ర‌త్ తెలిపారు. ప్రస్తుతం సోమ‌వారం, బుధ‌వారం, శుక్రవారాల్లో ఈ స‌ర్వీసు న‌డుస్తుండగా.. త్వరలోనే ప్రతి రోజూ ఈ విమాన స‌ర్వీసు న‌డుపుతామ‌ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ‌ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు చెప్పిన‌ట్లు తెలియజేశారు. ప్రతిరోజూ క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసు అందుబాటులోకి రావ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు మంత్రి భరత్.

ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #andhrapravasi #NewAirports #AviationDevelopment #UnionMinister #InfrastructureBoost #AirportProjects